Sunday, May 5, 2024

ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారా…!! మీకు ఇది తెలియాల్సిందే

రోజు రోజుకి ట్రాఫిక్ రూల్స్ ను కఠినతరం చేస్తున్నారు పోలీసులు. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నేరం రుజువైతే జరిమానా తో పాటు3 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మొబైల్ తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు చార్జిషీట్ సమర్పించనున్నారు.

జరుగుతున్న ప్రమాదాలు కట్టడికే ఈ నిర్ణయం పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయం పై మరికొందరు రాష్ట్రం మొత్తం ఇలా పెడితే ఎంతమంది కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందా అని చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement