Thursday, May 2, 2024

రీ-రిలీజ్ కానున్న కల్ట్ క్లాసిక్ మూవీ “మోసగాళ్లకు మోసగాడు”

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ.. ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉటుంది. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన నటుడు, నిర్మాత అతడు. కృష్ణ నటించిన తొలి కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. కాగా, ఈ సెన్షెషనల్ మూవీ ఇప్పుడు టాలీవుడ్ రీ-రిలీజ్ ట్రెండ్ లో జాయిన్ అయింది.

- Advertisement -

మే 31 నాడు కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీని రీ-రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మోసగాళ్లకు మోసగాడు మూవీ 1971, ఆగస్ట్ 27న రిలీజప అయ్యి, ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ సినిమా.. తాజాగా 4కే క్వాలిటీతో రీరిలీజ్ కానుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement