Thursday, April 25, 2024

సీపీఎం నేత సీతారాం ఏచూరి నివాసంలో విషాదం

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాసంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి కల్పకం ఏచూరి (88) శనివారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్పకం మృతి చెందినట్లు సమాచారం. చిన్నతనం నుంచే ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్‌కు కల్పకం అభిమాని మాత్రమే కాకుండా ఆమె బాటను జీవితాంతం అనుసరించారు.

కాగా కల్పకం మృతి పట్ల సీపీఎం పార్టీ సంతాపం ప్రకటించింది. ఆమె పార్థివదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు సీపీఎం తెలిపింది. కల్పకం ఏచూరి మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement