Thursday, May 2, 2024

మాస్క్ పెట్టుకోమంటే.. ముద్దు పెడతానంది

దేశ రాజధానిలో ఓ జంట హల్ చల్ చేసింది. కరోనా నిబంధనలు పాటించకుండా కారులో షికారుకు వెళ్లిన ఆ జంటను పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. దీంతో ఆ ఇద్దరూ రెచ్చిపోయారు. పోలీసులకు దురుసుగా సమాధానమిచ్చారు. నా భర్తకు ముద్దిస్తా… అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఫైర్ అయ్యింది సదరు యువతి

ఓ కారులో భార్యాభ‌ర్తలు ధరియా‌గంజ్ నుంచి వెళ్తున్న స‌మ‌యంలో వారు కరోనా నిబంధనలు పాటించడం లేద‌ని పోలీసులు కారును ఆపారు. మాస్కులు ఎందుకు ధరించలేదని వారిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఆ దంప‌తుల‌కు కోపం వ‌చ్చేసింది. త‌న భ‌ర్త కంటే ముందే కారులోంచి దిగి యువ‌తి పోలీసుల‌తో గొడ‌వ ప‌డింది. త‌న‌ భర్తకు ముద్దు కూడా ఇస్తాన‌ని, త‌మ‌ను అడ్డుకుంటారా? అని కోప్ప‌డింది. పోలీసులు భార్యాభ‌ర్త‌లిద్ద‌రినీ అరెస్టు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు. అయితే వారిద్ద‌రు చివ‌ర‌కు మాస్కులు పెట్టుకుని విచార‌ణ‌కు వ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement