Thursday, May 2, 2024

TS | ఈ నెలాఖరు నుంచి పత్తి కొనుగోళ్లు.. సిద్ధమవుతున్న మార్కెటింగ్‌శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా పత్తి ఏరివేత పనులు ముమ్మరంగా సాగుతుండడంతో ఈ నెలాఖరు నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ సిద్ధమైంది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 350 కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తికి మద్దతు ధర రూ.7,020గా ఉంది. ఈ ధర దక్కాలంటే పత్తిలో తేమ 8శాతం మాత్రమే ఉండాలని, అయితే 16-17శాతం తేమ ఉన్నప్పటికీ ప్రైవేట్‌ వ్యాపారులు రూ.6,800 నుంచి రూ.7 వేలకు క్వింటా పత్తిని కొనుగోలు చేస్తున్నారని అధికారులు తెలిపారు.

ఇప్పటికే నల్లగొండ జిల్లాలోనివ్యవసాయ మార్కెట్లకు పత్తి రాక మొదలైంది. మరో 10-15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కోతకు రానుంది. ఆ సమయంలో ధరలు పడిపోయి రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుగానే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్టు మార్కెటింగ్‌ శాఖ చెబుతోంది.

- Advertisement -

బహిరంగ మార్కెట్‌లో పత్తి ధరలు పడిపోతే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, దాదాపు 40 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement