Saturday, April 27, 2024

బడులే హాట్ స్పాట్లు

తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ కోవిడ్ పాజిటిక్స్ సంఖ్య పెరుగు తోంది. నిన్న మొన్నటి వరకు ప్రతి రోజూ దాదాపు 10 జిల్లాల్లో (0 పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. కేసులు నమోదైన జిల్లాల్లోనూ 1 నుంచి 5 లోపు మాత్రమే కొత్త కేసులు ఉండేవి. అయితే ఇప్పుడు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, కరీం నగర్జిల్లాల్లో ప్రతీ రోజూ పది దాకా, వారంలో ఒకటి రెండు రోజులు పదికి మించి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. విడతల వారీగా ప్రజలకు కరోనా టీకా అందుతోందని, ఇకపై కరోనా బెడద ఉండదని అనుకుంటున్న తరుణంలో కొత్త రకం స్ట్రెయిన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా టీకా కొత్తరకం స్ట్రెయి పై కూడా పనిచేస్తోందని శాస్త్రవేత్త లు ప్రకటిస్తున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో భయం పోవడం లేదు.

పాఠశాలలే హాట్ స్పాట్లు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను తిరిగి ప్రారంభించిన విషయం విధితమే. దీంతో పాఠశాలలే హాట్‌స్పాట్లుగా కరోనా వైరస్ తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తోంది. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్ధులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు కరోనా బారిన పడుతున్నారు. మంచిర్యాలలో మహమ్మారి కలకలం మంచిర్యాలలో మహమ్మారికరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం మరో 15 మందికి వైరస్ కింది. మంగళవారం 80మందికి కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా… 11 మంది టీచర్లు… ఇద్దరు వంట నిర్వహకులతోపాటు ఓ విద్యార్థికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సోమవారం చేసిన పరీక్షల్లోనూ 14 మంది విద్యార్ధులకు వైరస్ సోకినట్లు మరోవైపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోనూ కరోనా కలకలం కొనసాగుతోంది. జిల్లా కేందంలోని ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ టెస్టులు చేయగా… ముగ్గురు టీచర్లు, ఒక పదోతరగతి విద్యార్థికి వైరస్ సోకింది. జిల్లాలోని రామడుగు మండలం వెలిచాలలోనిగుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది. 180 మంది గ్రామస్థులకు కరోనా పరీక్షలు చేయగా… 20 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో పీహెచ్ సీ పరిధిలోప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 22 మందికి కరోనా పాజిటివ్ గానిర్ధారణ అయింది. యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్ట్రెయిన్‌ లక్షణాలు ఉండ డంతో హైదరాబాద్ లోని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన 19 మంది శాంపిళ్లను సేకరించారు.

మరోవైపు హైదరాబాద్ లోని ఎల్‌బీనగర్నాగోల్ లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. నాగోల్ బండ్లగూడలోని తెలంగాణమైనారిటీస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు 86 మందిదాకా విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మిగతా విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఒకేసారి 36 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులుఆందోళనకు గురవుతున్నారు. కరోనా సోకుతుందన్న భయంతో విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లిపోతున్నారు. కామారెడ్డి టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 140 మంది విద్యార్థినిలకు ర్యాపిడ్ ఆంటిజెన్ టెస్టులు నిర్వహించగా 32 మంది బాలికలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే చౌటుప్పల్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదుగురికి కరోనా సోకినట్లు తెలిసింది. కరోనా బారిన పడుతున్న వారిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాటీచింగ్ స్టాఫ్ సైతం ఉంటున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక
చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement