Sunday, May 5, 2024

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా నమోదైనవి 2,483

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గుదలతో కొత్తకేసులు స్థిరంగా ఉంటున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,49,197 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,483 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.55శాతంగా ఉంది. తాజాగా 1970 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 15,636కి దిగొచ్చాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల రేటు 0.04శాతంగా ఉంది. తాజాగా మరో 399 కరోనాతో మరణించారు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో మరణాల సంఖ్యను సవరించడంతో మృతులు పెరిగినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

ఇటీవల రోజువారి కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఢిల్లీతోపాటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలు మాస్క్‌ నిబంధన లను అమల్లోకి తెచ్చాయి. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం 22.83లక్షల మంది టీకా తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement