Sunday, April 28, 2024

లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చారు.. మహారాష్ట్రలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి..

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్ర సర్కారు ఇప్పటికే చాలా చోట్ల లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. దీంతో జనం గుంపులు కడుతున్నారు. కరోనా ముప్పుందని తెలిసినా.. నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీంతో రెండ్రోజులుగా తగ్గిన కరోనా కేసులు తాజాగా మళ్లీ ఎక్కువయ్యాయి. పది వేల మార్కును దాటాయి. నిన్న కొత్తగా 10,107 మంది మహమ్మారి బారిన పడ్డారు. అంతకుముందు రోజు 7,652 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంటే ఒక్కరోజులోనే 2,500 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ముంబై మహా నగరంలో 821 కేసులు నమోదవగా.. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 50 శాతం వరకు పెరిగాయి. గత 11 రోజుల్లో నగరంలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement