Monday, May 6, 2024

ఎస్సీ వర్గీకరణపై సంప్రదింపులు పూర్తి కాలేదు.. ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్గీకరణపై మంగళవారం లోక్‌సభలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఎన్‌సీఎస్‌సీఎస్‌సీ సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఇంకా సంప్రదింపులు పూర్తి కాలేదన్నారు.

ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉంచుతోందని ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఆరోపించారు. వర్గీకరణ జరగక ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భావించిన సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ద్వారా ఎస్సీ వర్గీకరణపై ఆమోదించిన తీర్మానాన్ని 2015లోనే కేంద్రానికి పంపారని ఆయన గుర్తు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement