Friday, May 3, 2024

Congress vs BRS – బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల‌రాజు పై రాళ్ల దాడి…చికిత్స కోసం హైద‌రాబాద్ కు త‌ర‌లింపు

అచ్చంపేట – భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఊహించని షాక్ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై…రాళ్ల దాడి జరగడం కలకలం రేపింది. శనివారం రోజున రాత్రి ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో గువ్వల బాలరాజు వర్గానికి, స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య సంఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహాబ్ రెండువైపులా పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం గువ్వల బాలరాజును హైదరాబాద్ తరలించినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement