Tuesday, May 21, 2024

Jagityala: తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ కరెంట్ కావాలా..? కేసీఆర్ కరెంట్ కావాలా.. ? మీరే తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా రైతులను దగా చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు కాంగ్రెస్ ఏనాడూ ఉచిత విద్యుత్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని, మూడెకరాల పొలం తడవాలంటే మూడు గంటల కరెంట్ సరిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు ఏం సమాధానం చెబుతారు? అంటూ కేటీఆర్ నిలదీశారు. టీపీసీసీ అధ్యక్షుడు రాసిందే రాత, గీసిందే గీత అన్నట్టుగా పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ సన్నాసుల మాటలను ప్రజలు వినొద్దని సూచించారు. కాంగ్రెస్ రాబందుల పార్టీ అని అభివర్ణించారు. రాహుల్ గాంధీకి ఎడ్లు, వడ్లు తెలియవని, ఆయనకు తెలిసిందల్లా పబ్బు, క్లబ్బు మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement