Sunday, April 28, 2024

Congress దేశవ్యాప్తంగా నిరసనలు.. కేంద్రం తీరుపై ఆందోళన

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కాంగ్రెస్‌కు రూ.1,800 పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేయడాన్ని ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా, , పన్ను ఉగ్రవాదంపై కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. దీనికి వ్యతిరేకంగా మార్చి 30, 31 (శని, ఆదివారాలు) దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.

ఐటీ శాఖ నుంచి రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ తమకు నోటీసు అందిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో వెల్లడించారు. దీనిపై ఆయన స్పందిస్తూ దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో అన్ని రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని అన్ని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలకు (పీసీసీ) పిలుపునిచ్చారు.

ఈ నిరసనల్లో పార్టీ సీనియర్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొనాలని కోరారు. పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు రాసిన లేఖలో భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ పన్నుతున్నదని వేణుగోపాల్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ కమిటీలు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement