Sunday, April 28, 2024

అవయవ దాత ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి….రియల్ హీరో

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై చికిత్సపొందుతూ కెపిహెచ్ బి పోలీసులు స్టేషన్ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే మహిపాల్ రెడ్డి చనిపోతూ కూడా పది మందికి జీవితం ఇచ్చాడు. గుండె, కళ్ళు కిడ్నీలు, లివర్‌ను దానం చేశాడు. మహిపాల్ రెడ్డి చేసిన ఈ పనికి నెటిజన్స్ తో పాటు సగటు మనిషి ప్రతీ ఒక్కరూ కూడా ప్రశంసిస్తున్నారు. అంతే కాదు ఓ పాట ను కూడా రాసి మహిపాల్ రెడ్డికి పోలీస్ డిపార్ట్ మెంట్ అశ్రునివాలి అర్పించారు. ఆ పాట లిరిక్స్ ను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాశారు.

అయితే మహిపాల్ రెడ్డి అవయవదానం చెయ్యటం పట్ల ఆయన అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయన గొప్ప మనసుకి పాదాభివందనం చేస్తున్నారు.కాగా మహిపాల్ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించారు. బండ్లగూడ జాగీర్ కిస్మత్ పూర్ లోని మహిపాల్ రెడ్డి నివాసం వద్ద కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరామర్శించారు. అనంతరం సీపీ సజ్జనార్ స్వయంగా మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు లో పాల్గొని స్వయంగా పాడే మోశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినవి అన్ని వచ్చేలా చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement