Friday, May 3, 2024

త్వ‌ర‌లో నెట్ ప్లిక్స్ లో – నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్

ప‌లు రూమర్స్ కి చెక్ పెడుతూ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ – విఘ్నేష్ ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నెట్ ప్లిక్స్ సంస్థ‌. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లోకి వస్తోంది అని పేర్కొన్న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్.. ప్రీమియర్ తేదీని ఇంకా ప్రకటించలేదు. నయన్ – విఘ్నేష్ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీని డైరెక్టర్ గౌతమ్ మీనన్ రూపొందించారని సమాచారం. కాగా నయనతార – విగ్నేష్ శివ‌న్ పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలు తప్ప ఇతర వీడియోలేవీ బయటకు రాలేదు. ఏ సెలబ్రిటీ కూడా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయలేదు.

దీనికి కారణం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వీరి వివాహ కార్యక్రమాన్ని డాక్యుమెంటరీ రూపంలో ప్రీమియర్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడమే. నయన్ – విగ్నేష్ ల పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను నెట్ ప్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. కాగా ఓటీటీ దీనికి సంబంధించిన వీడియో గ్లిమ్స్ ను విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.విగ్నేష్ – నయనతార ఒకరిపై ఒకరికున్న ప్రేమ .. గౌరవాభిమానాల గురించి చెప్పడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ డాక్యుమెంటరీ వీరి పెళ్లితో పాటుగా జ్ఞాపకాలు – ప్రత్యేక క్షణాలు – వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు అనేక ఇతర విషయాల మ్యాజికల్ జర్నీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.మేము ఉత్సాహంగా డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement