Wednesday, May 1, 2024

సిక్స్ లు బాదిన క‌మెడియ‌న్ యోగి బాబు-ఆస‌క్తిక‌రంగా నెటిజ‌న్స్ కామెంట్స్

ఓ టీవీ ఛానెల్ లో ప్ర‌సార‌మ‌య్యే పాపుల‌ర్ కామెడీ షో ద్వారా త‌న జ‌ర్నీని ప్రారంభించారు స్టార్ క‌మెడియ‌న్ యోగి బాబు. అనంతరం యోగి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. ఈ మూవీ తరువాత బాబుగా ఉన్న తన పేరును యోగి బాబుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. నేడు స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో యోగి బాబు తీరికలేని షెడ్యూల్‌తో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు . మాన్ కరాటే సినిమా ద్వారా కోలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. తన హాస్యంతో ఆడియన్స్ నవ్విస్తూ.. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తాజాగా యోగి బాబు చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. క్రికెట్ ఆడుతున్న వీడియోను ఆయన షేర్ చేశాడు. బంతిని బలంగా బాదుతూ.. తనలోని బ్యాట్స్‌మెన్‌ను ఆవిష్కరించాడు. కొన్ని బంతులను బౌండరీ దాటించేలా షాట్స్ ఆడాడు. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ స్థానంలో యోగి బాబును టీమ్‌లో తీసుకోవాలని బీసీసీఐను రిక్వెస్ట్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ జట్టులో యోగి బాబు పేరును సెలెక్టర్లు మర్చిపోయారని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement