Sunday, April 28, 2024

యుక్త వ‌య‌సులోనే పెద్ద పేగు క్యాన్స‌ర్…

హైదరాబాద్‌, మారిన జీవనశైలి యువత ను ప్రాణాంతక క్యాన్సర్లకు దగ్గర చేస్తోంది. ఒత్తిడితో కూడిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లతో కోలన్‌ (పెద్దపేగు చివరిభాగపు క్యాన్సర్‌) క్యాన్సర్‌ బారిన పడుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కోలన్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్న యువత సంఖ్య ఏటికేడు రెండింతలవుతోంది. గడిచిన కొన్నేళ్ల పరిణామాలను గమనిస్తే హైదరాబాద్‌లో పెద్ద పేగు క్యాన్సర్‌ బారిన పడిన యువత సంఖ్య రెం డింతలైందని అంకాలజీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోలన్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్న యువత సంఖ్య పెరగడమే కాకుం డా చాలా మందిలో వ్యాధి ముదు రుతోంది. పెద్దపేగు చివరి భాగం లో పాలివ్స్‌ ఏర్పడి వాటిలో కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే కోలన్‌ క్యాన్సర్‌. సాధారణంగా ఈ క్యాన్సర్‌ 60ఏళ్ల పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఇటీవల ఇది యువతలోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తుండడం వైద్య నిపు ణులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే గడిచిన 2020లో హైదరాబాద్‌లో పెద్ద పేగు క్యాన్స ర్‌తో ఆసుపత్రుల్లో చేరిన యువత కేసుల సంఖ్య రెండింత లెందని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి అంకాలజీ విభాగం వైద్యులు చెబుతున్నారు. నగరంలోని నిమ్స్‌, బసవతారకం ఆసుపత్రు లలోని క్యాన్సర్‌ విభాగం వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఎంఎన్‌జే ఆసుపత్రిలో 101 కొలోన్‌ క్యాన్సర్‌ కేసులు రికార్డు కాగా, 2020లో ఆ సంఖ్య 200లకు చేరింది. హైదరాబాద్‌లోని మరో రెండు క్యాన్సర్‌ ఆసుపత్రుల్లోనూ ఏటా 200 దాకా కొలోన్‌ కేసులు నమోదవుతున్నాయి.
పెద్ద పేగు క్యాన్సర్‌కు దారి తీస్తున్న కారణాలు చాలా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సంప్రదాయబద్ధమైన ఆహారం కాకుండా అధిక మొతాదులో మసాలాలతో కూడిన, ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్‌తో పాటు మద్యం, ఇతర శీతల పానీయాలు సేవించడం, పొగ తాగడం, రెడ్‌మీట్‌ ఎక్కవగా తినడం, ఆర్గానిక్‌ ఆహార పదార్థాలు కాకుండా రసాయ నాల తో కూడిన ఆహారాన్ని భుజించ డం తో పెద్ద పేగు చివరన కణితులు ఏర్పడి అవి యదేచ్చగా పెరిగి పో తూ కొలోన్‌ క్యాన్సర్‌కు దారి తీస్తు న్నాయి. అజీర్తి, విరేచనాలు, మల ం, మలవిసర్జనలో మార్పు లు, మలంలో రక్తం, రక్తం చారికలు, పొట్ట దిగువ భాగంలో నొప్పి, పట్టేసినట్లు ఉండడం, గ్యాస్‌ ఉండడం, మలవిసర్జన సమ యంలో నొప్పి, అకారణంగా నీరసం, బరువు తగ్గడం వంటివి కోలన్‌ క్యాన్సర్‌ లక్షణాలని అంకాలజీ వైద్యులు చెబుతున్నారు.
కొన్నేళ్ల క్రితం కోలన్‌ క్యాన్సర్‌ అరుదుగా వచ్చేది. అయితే ఇటీవల ప్రాణాంతక క్యాన్సర్ల జాబితాలో ఈ క్యాన్సర్‌ ఆరవ స్థానానికి ఎగబాకిందని అంకాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలోనూ ఎక్కువగా మహిళలే ఈ వ్యాధి బారిన పడుతుండడం గమనార్హం. కోలన్‌ క్యాన్సర్‌ను తరిమి కొట్టాలంటే… మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకర మెన జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్య నిపుణులు సూచి స్తున్నారు. తొలిదశలోనే గుర్తిస్తే రాడికల్‌ సర్జరీ ద్వారా కోలన్‌ను నయం చేయొచ్చు. లాప్రోస్కోపిక్‌ పద్దతిలోనూ చికిత్స అం దించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement