Thursday, May 2, 2024

ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై క‌లెక్ట‌ర్ స‌మీక్ష – పాల్గొన్న ప్ర‌భుత్వ అధికారులు

జయశంకర్ భూపాలపల్లి : చిన్నకాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగ్ భూసేకరణ పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓఎస్డి మనోహర్ తో కలిసి జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై రెవిన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే అధికారులతో సమీక్షించి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న చిన్నకాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ పెండింగ్ భూసేకరణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించి వేగవంతం చేసిందని అన్నారు. గతంలో సేకరించి ఇరిగేషన్ శాఖకు అందజేసిన భూమికి పెగ్ మార్క్ ఏర్పాటుచేసేందుకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మూలంగా పంప్ హౌస్ ఏర్పాటు .. పైపులైన్ల ఏర్పాటు, కాలువల నిర్మాణానికి అవసరమైన పట్టా భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే త్వరలో చేపడతామని తెలిపారు. చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా కాటారం కొత్తచెరువును నింపి వానకాలం పంటలకు నీరు అందేలా చర్యలు చేపడతామని అన్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ కి అవసరమైన పెండింగ్లో ఉన్న 353 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి సంబంధిత 12 గ్రామాల భూమి కోల్పోతున్న రైతుల నుండి అభ్యంతరాలను స్వీకరించామని ఇప్పటివరకు 172 అభ్యంతరాలు వచ్చాయని నష్టపరిహారం కోసం ఇరిగేషన్ శాఖకు లేఖ రాశామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం పంప్ హౌస్ లో భూమిని కోల్పోయిన గొల్ల బుద్ధారం గండికామారం రైతులకు పెండింగ్ 13 ఎకరాల భూమికి నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, సర్వే ల్యాండ్ ఎడి. సుదర్శన్ రాథోడ్, ఇరిగేషన్ ఎస్ఇ రమణారెడ్డి, ఇఇ లు యాదగిరి, తిరుపతి రెడ్డి, డీఇలు, ఏఇలు, మహదేవపూర్, కాటారం, భూపాలపల్లి, తాసిల్దార్లు శ్రీనివాస్, శ్రీనివాసరావు, ఇక్బాల్, కలెక్టరేట్ భూమి సేకరణ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement