Thursday, May 16, 2024

IPL | కుప్పకూలిన ఆర్సీబీ.. లక్నో టార్గెట్ 127

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ల‌క్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 43వ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. ఈ సీజన్ లోనే అత్య‌ల్ప టార్గెట్ సెట్ చేసింది. కాగా, కేఎల్ రాహుల్ క‌ప్టెన్సీ వ‌హిస్తున్న ల‌క్నో సూప‌ర్ జేయింట్స్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత‌ 120 బంతుల్లో 127 పరుగులు చేయాల్సి ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త‌రుఫున.. ఓపెన‌ర్స్ గా వ‌చ్చిన విరాట్ 30 బంతుల్లో 31 (3 ఫోర్లు) చేసి అవుట్ అవ్వ‌గా.. డుప్లెసిస్ 40 బంతుల్లో 44 ప‌రుగులు (1 ఫోర్) చేసి 5వ వికెట్ గా పెవిలియ‌న్ బాటపట్టాడు. అంతకుముందు వ‌చ్చిన అనుజ్ రావత్ 11 బంతుల్లో 9 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత వ‌చ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ కూడా 5 బంతులు ఆడి కేవ‌లం 4 ప‌రుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

- Advertisement -

ఇక ఆరో వికెట్ గా వ‌చ్చిన మహిపాల్ లోమ్రోర్ 4 బంతుల్లో 3 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. దినేష్ కార్తిక్ కూడా 11 బంతుల్లో 16 ప‌రుగులు చేసి 7వ వికెట్ గా పెవిలియ‌న్ బాటపట్టాడు. ఆపై కర్ణ్ శర్మ 2ప‌రుగులు చేయ‌గా, మహ్మద్ సిరాజ్ డ‌క్ అవుట్ అయ్యాడు. బెంగ‌ళూరు జ‌ట్టులో కోహ్లీ, డుప్లెసిన్ మిన‌హా మ‌రెవ్వ‌రూ క‌నీసవ 20 ప‌రుగులు కూడా చేయ‌లేక పోయారు. దీంతో ల‌క్నో ముందు ఆర్సీబీ ప్లేయ‌ర్లు అత్య‌ల్స టార్గెట్ సెట్ చేసి.. బ్యాటింగ్ లో పూర్తిగా విఫలం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement