Saturday, April 27, 2024

విక్ర‌మ్ తాజా చిత్రం కోబ్రా-సెన్సార్ ఆమోదం

ఏడు గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నారు స్టార్ హీరో విక్ర‌మ్.ఆయ‌న న‌టించిన తాజా చిత్రం కోబ్రా. ఈ ఏడు పాత్ర‌ల‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పార‌ట‌. ఈ చిత్రంలో విక్ర‌మ్‌కు జోడీగా ‘కేజీఎఫ్’ భామ‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీత సారథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్మించారు. ప్ర‌ముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రానికి సెన్సార్ యూ/ఏ స‌ర్టిఫికేట్ ని ఇచ్చారు. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. సై-ఫై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 31న విడుదల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుస అప్‌డేట్‌ల‌ను ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూ/ఏ స‌ర్టిఫికేట్‌ను ఇచ్చింది. ర‌న్ టైం 2 గంట‌ల 55 నిమిషాలు ఉండ‌నుంది. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement