Saturday, April 27, 2024

MDK: మనకు అండగా ఉన్న కేసీఆర్ కు మనం అండగా ఉండాలి.. హరీశ్ రావు

మనకు అండగా ఉన్న కేసీఆర్ కు మనం అండగా ఉండాలని, మళ్లీ కేసీఆర్ ను సీఎంగా చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గజ్వేల్ ఐడిఓసిలో గజ్వేల్ నియోజకవర్గంలోని 181 మంది లబ్ధిదారులకు 1 కోటి 79 లక్షల ఇరవై వేల రూపాయల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, 33 లక్షల 80 వేల రూపాయల విలువైన 57 సీఎంఆర్ఎఫ్ చెక్కులను, 23 మంది పూజారులకు దీప, ధూప నైవేద్యం ప్రొసీడింగ్స్ ను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడపిల్ల పెళ్ళికి ఒక రూపాయి కూడా ఖర్చు సాయం చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ కుల, మతాల భేదం లేకుండా నిరుపేద ఆడపిల్లలందరి పెళ్ళికి 1లక్ష 116 రూపాయలు అందిస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement