Sunday, April 28, 2024

TS CM : సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది.

మరోవైపు.. సీఎం భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు. ఈ ఘటన జరిగాక ఈ ఒక్క కారు తప్ప మిగిలిన వాహనాలతో రేవంత్ కొడంగల్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement