Tuesday, May 14, 2024

అమిత్ షా తో సీఎం జగన్ భేటీ.. విభజన హామీలపై చర్చ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వీరి సమావేశంలో ప్రధానంగా విభజన హామీలపై చర్చించినట్లు సమాచారం. నిన్న ప్రధాని మోడీతో సమావేశమై రాష్ట్ర సమస్యలను అమిత్‌షాకు విన్నవించారు. రెవెన్యూ లోటు నిధులను వెంటనే విడుదల చేయాలని జగన్‌ కోరారు. 2014-15 రెవెన్యూలోటుతో పాటు 32,625 కోట్లు ఏపీ ప్రభుత్వానికి రావల్సి ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement