Monday, April 29, 2024

Cloning Actor – ఎన్టీఆర్ డూప్ తో వార్ 2 యాక్ష‌న్ సీన్స్ షూటింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న సినిమా ‘వార్ 2’. వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ వార్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వార్ 2 కోసం అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసి వెళ్లాడు. ఎన్టీఆర్ ని కలిసిన అతి తక్కువ రోజుల్లోనే వార్ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిపొయింది. ఫైటర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న హ్రితిక్ రోషన్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. ఎన్టీఆర్ దేవర షూటింగ్ కారణంగా వార్ 2 షూటింగ్ అటెండ్ అవ్వలేదు. ఎన్టీఆర్ కూడా ఉండాల్సి రావడంతో అయాన్ ముఖర్జీ వార్ 2 షూటింగ్ ని హ్రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ డూపుతో లాగేసాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement