Saturday, April 27, 2024

ప్రాణాలు తీస్తున్న రక్తప్రసరణ వ్యాధులు.. బీపీ, షుగర్‌, గుండెపోటు, కిడ్నీ వ్యాధుల దాడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 60శాతం మేర గుండె, మెదడు, తదితర రక్తప్రసరణ వ్యాధుల కారణంగా నే నమోదవుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అసంక్రమిత (ఎన్‌సీడీ) వ్యాధుల ప్రభావంపై ఆశాలు, ఏఎన్‌ఎంలతోపాటు ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించాయి. ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రజారోగ్యశాఖ వైద్య, ఆరోగ్యశాఖకు సమర్పించింది. నివేదికలో విస్తు గొలిపే విషయాలు బహిర్గతమయ్యాయి. తెలంగాణ ప్రజలను వేధిస్తున్న రక్తప్రసరణ వ్యాధుల్లో సింహభాగం షుగర్‌, బీపీ, అధిక రక్తపోటు ఉన్నాయి.

బీపీ, షుగర్‌ వ్యాధులు పంజా విసురుతున్నా ఆ వ్యాధుల నియంత్రణ, తీసుకోవాల్సిన చికిత్స, నియంత్రణకు అనుసరించాల్సిన ఆహారపు అలవాట్లపై ఇప్పటికీ 70శాతం రోగులకు అవగాహన లేదని వైద్య, ఆరోగ్యశాఖ తేల్చింది. బీపీ, షుగర్‌ మదిరి ఆ దుష్పరిణామం కిడ్నీల వైఫల్యం , క్యాన్సర్‌ , గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. తెలంగాణలో దాదాపు 16శాతం మంది బీపీతో, 7శాతం మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు.

- Advertisement -

బీపీ, షుగర్‌ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుటే 100శాతం వ్యాధిని నియం చేయొచ్చని సాక్షాత్తు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పలు వేదికల మీద ప్రజలకు సూచిస్తున్నారు. అసంక్రమిత వ్యాధులను ఆదిలోనే నియంత్రించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బీపీ, షుగర్‌ వ్యాధి నిర్ధారణా పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తోంది. బీపీ, షుగర్‌ ఉన్న వారి ఇంటి వద్దకే ఉచితంగా ఔషధ కిట్లను ఏఎన్‌ఎంలు, ఆశలు అందించేలా చర్యలు తీసుకుంటోంది. బీపీ, షుగర్‌ వ్యాధి గ్రస్థులు నిత్యం మందులు వాడాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. నెలకు సరిపడా మందులతో కూడిన కిట్‌ను ఆరోగ్య సిబ్బంది ఇంటి వద్దకే చేరుస్తున్నారు. నిరక్ష్యరాస్యులు కూడా సులువుగా గుర్తించేలా మూడు విభాగాలు మందులను విభజి స్తున్నారు. దాదాపు రూ.1000 విలువైన మందులను సరఫరా చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇప్పటికే బీపీ, షుగర్‌ మందుల కిట్లు పంపిణీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement