Friday, April 19, 2024

సిస్కోలో 4వేల మంది తొలగింపు.. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మంది లేఆఫ్‌

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సిస్కో 4 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ , మెటా, ట్విటర్‌, లెనివో, సేల్స్‌ఫోర్స్‌, అడోబ్‌ వంటి ప్రముఖ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంకా తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో సిస్కో కూడా భారీగా ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించింది. సిస్కో గత నెలలోనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది. సిస్కో తొలగించాల్సిన ఉద్యోగులకు వ్యక్తిగత మెయిల్స్‌ ద్వారా సమాచారం అందించింది.

- Advertisement -

మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయిన సిస్కో అందుకు అనుగుణంగా 4 వేల మందిని లేఆఫ్‌ చేసింది. సంస్థలో కొన్ని బిజినెస్‌లను పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను తగ్గించుకున్నట్లు సంస్థ ఛైర్మన్‌, సీఈఓ రాబిన్స్‌ తెలిపారు. ప్రముఖ టెక్నాలజీ, ఐటీ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 2 లక్షలకు పైగా ఉందని దిలేఆఫ్‌ డాట్‌కామ్‌ అనే వెబ్‌ సైట్‌ అంచనా వేసింది. ప్రధానంగా అమెరికాలో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement