Tuesday, May 21, 2024

ప్రత్యక్ష ఎన్నికల్లో సినీ హీరో పోటీ

తమిళ నాట్ ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో విజయం సాదించేందుకు అన్ని పార్టీలు కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే డీఎంకే 173 అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.

కాగా ఈ ఎన్నికల్లో స్టాలిన్ కుమారుడు, తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడు. గతంలో కరుణానిధి పోటీ చేసిన చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ చేస్తున్నాడు. 1996 నుంచి చెపాక్ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోట. కాగా ఈసారి ఆ స్థానం నుంచి ఉదయనిధి స్టాలిన్ బరిలో ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement