Wednesday, May 15, 2024

చిత్రా రామకృష్ణ వీఐపీ ఖైదీ కాదు.. జైలులో స్పెషల్​ ఫుడ్​ అరేంజ్​మెంట్స్​ ఉండవన్న కోర్టు

తీహార్​ జైలులో రిమాండ్​ ఖైదీగా ఉన్న ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు ఇంట్లో వండిన ఆహారం, ఇతర ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని చేసిన అభ్యర్థనను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన స్టాక్ బ్రోకర్‌పై 2018 నుండి కో-లొకేషన్ స్కామ్‌ను విచారిస్తున్న సీబీఐ, అప్పటి ఎన్‌ఎస్‌ఇలోని ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సెబీ నివేదిక చూపించడంతో చిత్ర రామకృష్ణను అరెస్టు చేసింది.

ప్రతి ఖైదీ ఒకేలా ఉంటారు, ఆమెకు ప్రత్యేక వసతులేవీ కల్పించలేము. ఆమె VIP ఖైదీ కాదు.. నిబంధనలను మార్చలేము అని న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ చిత్రా రామకృష్ణ తరఫు న్యాయవాదితో అన్నారు. కాగా, విచారణ సమయంలో ఆమె సహకరించలేదని, ఎటువంటి సమాధానాలు చెప్పకుండా తప్పించుకుందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఎన్‌ఎస్‌ఇ కో-లొకేషన్ స్కామ్‌లో విచారణ కొనసాగుతున్నందున ఆమె సూత్రధారి అవునా, కాదా అన్నది తేల్చలేకపోతున్నామని, లబ్ధి పొందిందా లేదా అని చెప్పడం కష్టంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement