Friday, April 26, 2024

కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లిన మెగాస్టార్ దంపతులు

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ చిరంజీవి కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి అని చిరంజీవి తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: సంతోష్ శోభన్ ‘మంచిరోజులు వచ్చాయి’ పాత్రల ఇంట్రో వీడియో

Advertisement

తాజా వార్తలు

Advertisement