Thursday, May 2, 2024

సినీ ప్రముఖుల సమక్షంలో ఆస్కార్ విజేతలను సన్మానించిన చిరంజీవి..

నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి..కాగా చరణ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆస్కార్ అవార్డు విజేతలను తన ఇంట సత్కరించారు. రామ్ చరణ్ పుట్టినరోజున అయినవాళ్లు, ఆత్మీయుల సమక్షంలో ఆస్కార్ విజేతలను సన్మానించడం నిజంగా ఓ వేడుకలా జరిగిందని చిరంజీవి వెల్లడించారు. భారతీయ సినిమా గొప్పదనాన్ని చాటుతూ తెలుగువాళ్లు సాధించిన ఈ ఘనత చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందంలోని దర్శ‌కుడు రాజమౌళి-రమ, కీరవాణి-శ్రీవల్లి, డీవీవీ దానయ్య, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఎస్ఎస్ కార్తికేయలకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి గౌరవించారు. ఈ కార్యక్రమంలో హీరోలు నాగార్జున,వెంకటేశ్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అడివి శేష్, అఖిల్ అక్కినేని, అమల, అల్లు అరవింద్, దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్, నవీన్ యెర్నేని తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement