Friday, May 17, 2024

రేప‌టి నుంచే చైనా ఓపెన్.. భారత్ ఆట‌గాళ్లకు అగ్ని పరీక్ష‌

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 5 నుండి 10 సెప్టెంబర్ వరకు చైనాలోని చాంగ్‌జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ లో జరుగుతుంది. కాగా, రేపు (మంగళవారం) ప్రారంభమయ్యే చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో భార‌త్ త‌రుపున‌ హెచ్.ఎస్. ప్రణయ్ లక్ష్య సేన్‌తో ఈ టూర్ కి నాయకత్వం వహిస్తారు. ఈ చైనా ఓపెన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం లేక‌పోవ‌డం గ‌మానార్హం.

కాగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో తన కెరీర్‌లో అత్యధిక ప్రపంచ ర్యాంకింగ్ 6వ ర్యాంక్‌ను సాధించిన ప్రణయ్, మలేషియాకు చెందిన ఎన్జీ ట్జే యోంగ్‌తో తన ప్రారంభ మ్యాచ్ ఆడ‌నున్నాడు. ప్రారంభ రౌండ్‌ను అధిగమిస్తే, థాయిలాండ్‌కు చెందిన ప్రపంచ నం. 4 , మూడవ-సీడ్ కున్లావుట్ విటిడ్‌సర్న్‌తో రౌండ్ ఆఫ్ 16లో తలపడేచాన్స్ ఉంది. ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నం.9 జొనాటన్ క్రిస్టీతో ఆడే అవ‌కాశం ఉంది. సెమీఫైనల్స్‌లోకి ఎంటర్ అయితే టాప్-సీడ్ అక్సెల్‌సెన్‌తో మ‌రో సారి పోటీ ప‌డ‌నున్నాడు ప్ర‌ణ‌య్.

- Advertisement -

ఇక‌, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ ల‌క్ష‌ సేన్‌లక్ష్య డెన్మార్క్‌కు చెందిన అండర్స్ ఆంటోన్‌సెన్‌తో త‌ర ప్రారంభ మ్యాచ్ లో త‌ల‌ప‌డ‌నున్నాడు. ఇక రౌండ్ 16వ సింగపూర్‌కు చెందిన ఏడో సీడ్ లోహ్ కీన్ యూతో.. క్వార్టర్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1 అక్సెల్‌సెన్‌తో లక్ష్య సేన్ తలపడే అవకాశం ఉంది.

మ‌రో భార‌త ప్లేయ‌ర్ ప్రియాంషు రజావత్.. ఇండోనేషియాకు చెందిన షెసర్ హిరెన్ రుస్తావిటోతో ప్రారంభ రౌండ్‌లో పోటీ ప‌డ‌నున్నాడు.

పురుషుల డబుల్స్‌లో, సాత్విక్‌- చిరాగ్ ఇండోనేషియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ-బగాస్ మౌలానాతో తమ ప్రారంభ మ్యాచ్ ఆడ‌నున్నారు.అదే విధంగా, భారత్ నుండి M R అర్జున్ -ధృవ్ కపిల.. జపనీస్ ద్వయం కైచిరో మట్సుయ్- యోషినోరి టేకుచితో తలపడతారు.

ఇక‌, మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ చైనా టాప్-సీడ్ జంట చెన్ క్వింగ్ చెన్- జియా యి ఫ్యాన్‌తో తలపడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement