Saturday, May 4, 2024

తెగింపు లిరిక‌ల్ సాంగ్.. అజిత్ లుక్ అదిరిందిగా

త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టిస్తోన్న తాజా చిత్రం తునీవు.ఈ మూవీని హెచ్. వినోద్ రూపొందిస్తున్నాడు.బోనీ కపూర్ నిర్మించారు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ మూవీ ఇది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నారు. తెలుగులో అదే రోజున ‘తెగింపు’ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘ఛిలా ఛిలా ఛిల్లా’ అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. ఇది పక్కా మాస్ సాంగ్. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ యాక్షన్ సినిమా ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. అలాగే అజిత్ బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తోంది. అజిత్ సరసన హీరోయిన్ గా మంజూ వారియర్ నటించింది. సముద్రఖని .. అజయ్ .. చిరాగ్ జాని ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement