Wednesday, May 1, 2024

Water Matters | నంది మేడారంలో పుష్కలంగా నీళ్లు.. చివరి ఆయకట్టు దాకా ఢోకా లేదు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌: చరిత్రాత్మకమైన నంది మేడారం చెరువు చివరి ఎకరా వరకు పుష్కలమైన సాగునీరు అందించేందుకు నీటివిడుదల నిరంతరం జరుగుతుంది. జూలైలో వచ్చిన వరదల్లో మునిగిన లక్ష్మీ బ్యారేజ్‌ మోటర్లను పునరుద్ధరించి ప్రారంభించారు. అయితే ఈ బ్యారేజ్‌ నీరు అవసరం లేకుండానే నందిమేడారం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ 0.75 టిఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. నిల్వసామర్థ్యం 0.75 ఉండటంతో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నాయని వారు పునరుద్ధరించారు. ఇక నంది మేడారం చెరువు నిర్మాణమే ఓ చారిత్రిక సంఘటన ఈ చెరువును కాకతీయ చక్రవర్తి ప్రజాపరుద్రుడు నిర్మించగా తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ధరించి సాగువిస్తీర్ణం పెంచినట్లు చరిత్ర స్పష్టం చేస్తున్నది.

అడవిబిడ్డల ఆకలితీర్చేందుకు క్రీ.శ. 1289 నుంచి 1323వరకు పాలించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు నంది మేడారం చెరువు నిర్మించినట్లు అక్కడ అనేక ఆధారాలు లభ్యమవుతున్నాయి. 12వ సతాబ్దంలో కరీంనగర్‌ లోని పొలాస ప్రాంతాన్ని మేడరాజు పరిపాలించాడు. కరీంనగర్‌ జిల్లాలోని పద్దపల్లి ధర్మారం మండలం పరిధిలోని పొలాసలో ఈ చెరువు నిర్మాణం ఆనాడుజరిగింది. కాకతీయ ప్రతాపరుద్రుని ఆదేశం మేరకు మేడరాజులు ఈ తెరువును తవ్వించారు. నందిమేడారం మీదుగావిస్తరించి ఉన్న అడవుల్లోని గిరిజనులకు సాగు,తాగునీటి కేంద్రంగా ఈ చెరువు చరిత్రలో నిలిచిపోయింది. కాకతీయులామంతుడిగా మేడరాజు పాలించిన ఈ ప్రాంతంచెరువు తూర్పుభాగంలో త్రికుటేశ్వరఆలయం, 16 స్థంబాలతో నిర్మించిన విశాలమంటపం, ఏడున్నర అడుగుల పొడవు, 5.8 అడుగుల ఎత్తులోనిర్మించిన నంది విగ్రహంతో ఈ ప్రాంతం నందిమేడారంగా చరిత్రలో నిలిచింది.

అయితే కాకతీయుల కట్టడాలు శిథిలాలుగా మారినప్పటికీ ఆనాటి రాజుల ప్రతిభకు, ప్రజాసంక్షేమానికి నిదర్శంగా మిగిలిన ఈ చెరువు సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురికాగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం పునరుద్ధరించడంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించి 300 ఎకరాల ఆయకట్టునుంచి 599 ఎకరాల ఆయకట్టువరకు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖనీరు అందిస్తుంది. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక శ్రద్ధతో ఆయకట్టు పెంచడంతో పాటుగా యాసంగికి నీరందేవిధంగా ప్రణాళకను రూపొందించి అమలు చేస్తుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుఫ్యాకేజీ 7లో భాగంగా మేడారం పెద్దచెరువు సామర్థ్యాన్ని 0.167 టిఎంసీల నుంచి 0.75పెంచడం జరిగింది. ఈ చెరువు సామర్థ్యం పెంపు పనులు 3మార్చి 2018 న పూర్తిఅయిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి ఫ్యాకేజీ -6 జంట సొరెRంగాల ద్వారా నీరు తరలించి పంప్‌ హౌజ్‌ ద్వారా ఎత్తిపోసి మేడారం రిజర్వాయర్‌ ను నింపడం జరిగింది. రిజర్వాయర్‌ సామర్థ్యంపెంపుకు ముందు తర్వాత వ్యత్యాసం ఉంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 226.830 మీటర్లు ఉండగా అనంతరం 233మీటర్ల కు పెంచారు. నీటి నిల్వ సామర్థ్యం 0.167 నుంచి 0.75 టీఎంసీలకు పెంచారు. నంది మేడారం రిజర్వాయర్‌ ఆధారంగా ధర్మారం, ఎల్లంపల్లి, వెల్కటూరు మండలాల్లో సుమారు 600 ఎకరాలకుసాగునీరు అందుతుంది.ప్రస్తుత యాసంగి పంటకు 27 డిసెంబర్‌ 2022 నుంచి తూము ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల చేశారు.

- Advertisement -

ఇప్పటికీ రైతులు సుమారు 300 ఎకరాల్లో వరినాట్లు వేశారు. మిగిలిన 300 ఎకరాల్లో కూడా రైతులు నాట్లు వేస్తున్నారు. రిజర్వాయర్‌ ద్వారా నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్టుచేసిన తూము 219.882 మీటర్ల దగ్గరలో ఉంది. బుధవారం ఈ తూముద్వారా విడుదల చేసిన నీటి నిల్వ 0.234 టిఎంసీలుగా ఉంది. వరినాట్లు పూర్తి అయిన తర్వాత ప్రస్తుతం పుష్కలంగా ఉన్న నీరు అతర్వాత అవసరమైతే ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచిప్యాకేజీ(ప్యాకేజీ-6) జంట సొరంగాల ద్వారా నీటిని తరలించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉంది. రిజర్వాయర్‌ లో సరిపడ నీరు నింపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గానూ 19. 28 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.

అనేక మార్గాలద్వారా, ప్రాజెక్టుల ద్వారా పుష్కలమైన నీరు అందుబాటులో ఉండటంతో పాటుగా నంది మేడారం రిజర్వాయర్‌ లో నీరు ఉండటంతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ సంసిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో నందిమేడారం ఆయకట్టు రైతులు యాసంగి పంటలు వేసుకునే స్థాయికి ఎదగడమనేది ఓచారిత్రాత్మక దృశ్యం…కనుల ముందు సాకారమైన నీటి చిత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement