Thursday, April 25, 2024

Exams | మే నుంచి ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌.. త్వరలో రిలీజ్​ కానున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌

వచ్చేదంతా ఇక పరీక్షల సీజనే. ఒకవైపు వార్షిక పరీక్షలకు గడువు సమీపిస్తుండగా మరోవైపు ఉన్నత చదువుల కోసం వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే అర్హత పరీక్షల తేదీలు దగ్గర పడుతున్నాయి. మార్చి నుంచి జులై వరకు వివిధ వార్షిక, ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఇక ఉన్నత చదువుల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది. వీటకి సంబంధించిన షెడ్యూళ్లు ఒక్కొక్కటిగా త్వరలోనే వెలువడనున్నాయి. ఇందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈమేరకు షెడ్యూల్‌ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరోనా నేపథ్యంలో ప్రవేశ పరీక్షలు కాస్త ఆలస్యంగా నిర్వహించడంతో 2022 విద్యా సంవత్సరం ఒకట్రెండు నెలలు ఆలస్యంగా షురూ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత లేకపోవడం, చైనాలో మళ్లిd కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నత కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలను ఈసారి సమయానికి నిర్వహించేలే ప్లాన్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఎంసెట్‌, ఈసెట్‌, పీఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌ తదితర ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. వీటి పరీక్షలను మే నుంచి స్టార్ట్‌ చేసి జూలైలో అన్నీపూర్తి చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే జేఈఈ షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎంసెట్‌ నిర్వహణపై అధికారులు సమావేశమై ఈనెల చివరన లేదా ఫిబ్రవరిలో షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. అలాగే మే మూడో వారంలో ఎంసెట్‌ నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇతర జాతీయ ఎంట్రెన్స్‌ తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తున్నారు. ఒకలిద్దరు కన్వీనర్లు పదవీ విరమణ పొందనుండటంతో వారి స్థానంలో కొత్త వారికి ప్రవేశ పరీక్షల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

మే 17న పాలిసెట్‌ పరీక్ష!…
తెలంగాణ పాలీసెట్‌ 2023 ఎంట్రెన్స్‌ పరీక్ష మే 17న నిర్వహించాలని ఎస్‌బీటీఈటీ నిర్ణయించింది. ఈనెల 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఒకట్రెండు రోజుల్లో వెలువరిస్తామని అధికారులు చెప్పారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి జరిగే పాలిసెట్‌లో బాసర ఆర్‌జీయుకేటీ చేరడంలేదని ప్రకటించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ వర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ వర్సిటీ, ఇతర పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement