Saturday, May 18, 2024

కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్.. మల్లికార్జున ఖర్గే సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ, టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ ఇంటి పార్టీని మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో విలీనం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. భద్రాచలం ముంపునకు కారణం మోదీ, ఆయన మంత్రివర్గమేనని మండిపడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను బీజేపీ ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసిందన్న రేవంత్, కాంట్రాక్టులు-కమీషన్ల పేరుతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు.

చెరుకు సుధాకర్ చేరిక తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తి అని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీసుకునే చర్యలను తెలంగాణ ప్రజలు ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశానుని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను బలరుస్తామన్నారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నానని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమం కారుల కోసం త్వరలో పీసీసీ కమిటీ వేయబోతున్నట్టు సుధాకర్ వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement