Monday, April 29, 2024

వివాహిత హ‌త్య కేసు ఛేదించిన పోలీసులు

ఈ నెల 17వ తేదీన జరిగిన వివాహిత హత్య కేసును చెన్నూరు పోలీసులు చేథించారు. కడప జిల్లా…చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామం వనం వీధిలో చోటు చేసుకుంది..హత్య చేసి, దొంగతనం చేసిన అనంతపురం జిల్లా బుక్కరాయ గ్రామంకు చెందిన బోయ నాగరాజు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక జత బంగారు కమ్మలు, ఒక బంగారు పుస్తే, 800 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు డియస్పీ సునీల్ వివరాలు తెలిపారు.విలేకర్ల సమావేశంలో టూ టౌన్ సిఐ మహమ్మద్ అలీ, చెన్నూరు ఎస్సై శ్రీనివాసులురెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement