Tuesday, May 21, 2024

చెన్నమనేని కుటుంబం నుండి హీరో

చెన్నామనేని కుటుంబం నుండి హీరో తెరమీదికి వచ్చాడు. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు చెన్నామనేని విద్యాసాగర్ రావు సోదరుడు చెన్నామనేని వెంకటేశ్వర్ రావు కుమారుడు మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్రీకుమార్ పుత్ర రత్నం చెన్నమనేని సాయి లిఖిత్ హీరోగా నటించిన విశ్వక్ ఈ నెల 18న విడుదల అయింది. లిఖిత్ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమా రంగంలో మంచి భవిషత్తు ఉందని సినీ విమర్శకులు అంటున్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుకు కూడా సినిమా రంగంలో ప్రవేశం ఉంది. భారత్ బంద్ సినిమాలో సిఎం పాత్ర పోషించారు. చెన్నామనేని స్వంత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావు పేట మండలం నాగరం గ్రామస్తులు లికిత్ నటించిన సినిమాను చూసి సంబర పడ్డారు. కాగా, లికిత్ బిఏఎల్ఎల్బి పూర్తి చేసి ప్రస్తుతం హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement