Tuesday, April 30, 2024

గౌత‌మ్ రెడ్డి మృతికి ఉప‌రాష్ట్ర‌ప‌తి దిగ్భ్రాంతి

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. గౌత‌మ్ రెడ్డి కుటుంబంతో ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉంద‌న్నారు. త‌న‌పై ఎంతో అభిమానం చూపేవార‌న్నారు. ప‌నిప‌ట్ల నిబ‌ద్ద‌త క‌లిగిన నాయ‌కుడు గౌత‌మ్ రెడ్డి అన్నారు. చిన్న వ‌య‌సులోనే మృతిచెంద‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. గౌత‌మ్ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నానని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement