Thursday, April 25, 2024

Big story : నీటి వృధాను అరికట్టేందుకు చెక్‌ డ్యాంలు.. పెరుగుతున్న జలవనరులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థ స్వరూపం మారుతుంది. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి ప్రాజెక్టుల్లో నిలువ ఉంచడంతో పాటుగా సమద్రంలో కలవకుండా ఎక్కడికక్కడ చెక్‌ డ్యాంలు నిర్మించి తెలంగాణను నీటి బ్యాంకుగా మార్చే ప్రక్రియ జోరందుకుంది. ఉత్తరతెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో పాటుగా రిజర్వాయర్ల మరమత్తులు చేసి నీటి వనరులను పెంపొందించడంతో పాటు చిన్ననీటిపారుదల రంగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతిసంవత్సరం లక్షలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుండటం తో రాష్ట్ర ప్రభుత్వం ఆ నీటికి కట్టలు వేసే చెక్‌ డ్యాంల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. మొదటి దశ విజయ వంతంకావడంతోరెండవదశ పనుల ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

తక్కువబడ్జెట్‌, స్వల్ప సమయంలో ఎక్కువ ప్రయోజనాలు చెక్‌ డ్యాంల నిర్మాణాలతో ఉత్పన్నవముతున్నాయనే నిపుణుల నివేదికను ప్రమాణికంగా తీసుకుని భారీగా చెక్‌ డ్యాంల నిర్మాణ పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటివరకు నిర్మించిన చెక్‌ డ్యాంతో ఆయా ప్రాంతాల్లో గణనీయంగా భూగర్భజలవనరులు పెరిగినట్లు నిపుణులు నివేదికలు రూపొందించారు. ప్రధానంగా చెక్‌ డ్యాంలు నిర్మించిన ప్రాంతాల్లో భూసారం, భూగర్భనీటి వ్యవస్థ, పచ్చదనం పెంపొందినట్లు పలునివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

గొలుసు కట్టు చెక్‌ డ్యాంల నిర్మాణాలతో బహుళ ప్రయోజనాలు

కాకతీయులు తమరాజ్యంలో వేలాది గొలుసుకట్టు చెరువులు నిర్మించి భూగర్భజలాలను పెంపొందించి ధాన్యాగారంగా మలిస్తే తెలంగాణ ప్రభుత్వం జలవనరులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా గొలుసుకట్టు చెక్‌ డ్యాంలను నిర్మించి భూగర్భ జలాలను పెంపొందిస్తుంది. వాగులు,కాలువల ద్వారా కృష్ణా,గోదావరి నుంచి నీరు వృధాగా కడలిలో కలవకుండా ఎక్కడికక్కడ చెక్‌ డ్యాంలను నిర్మించి జలనిధిని పెంపొందిస్తుంది. ప్రయోగాత్మకంగా మెదక్‌ జిల్లాలోరూ. 331 కోట్లతో నిర్మించిన 75 చెక్‌ డ్యాంలు భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటుగా మత్తడి దూకుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల అంతారం వాగులో రూ. 25.53 కోట్లతో 12,పెెద్దవాగులోరూ. 77. 71 కోట్లతో 9 చెక్‌ డ్యాంలు, సదలవాగులో రూ. 6.90 కోట్లతో2 చెక్‌ డ్యాంలు, కోరుట్ల పెద్దవాగులో రూ. 6.90 కోట్లతో 17 చెక్‌ డ్యాంలతో పాటుగా అనేక జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్మించిన చెక్‌ డ్యాంలతో భూగర్భజలాలు పెరిగాయి. భూగర్భం నుంచి నాలుగు నుంచి 15 మీటర్ల ఎత్తులో నీరు లభిస్తుంది.

ఎండిన బోర్లు మత్తడి దూకినట్లు అగుపిస్తున్నాయి. అలాగే చెక్‌ డ్యాంల్లో చెపలపెంపకం చేపట్టడంతో ఆ వృత్తిమీద ఆధారపడినవారి జీవన ప్రమాణాలు పెరగడంతో అధికార యంత్రాంగం చెక్‌ డ్యాంల పై నివేదకల రూపకల్పనలో నిమగ్నమైంది . ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేసి ఏవాగుపై ఎన్ని చెక్‌ డ్యాంలను నిర్మించాలనే అంశంపై సమగ్ర నివేదికలను రూపొందిస్తున్నారు. భూగర్భ జలసంపద పెంచేందుకు చెక్‌ డ్యాంలు అనివార్యమనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.

- Advertisement -

చేక్‌ డ్యాంలతో నీటి సంరక్షణ విధానం

రాష్ట్రంలోని ప్రధాన వాగుల్లోగొలుసుకట్టు విధనంతో మొదటి దశలో 1200చెక్‌ డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపానా పరమైన అనుమతులతో పాటు నిధులను సమకూర్చింది. రూ. 3.825 కోట్ల రూపాయలను చెక్‌ డ్యాంలనిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. డ్యాంలనిర్మాణం కోసం నాబార్డు ఇప్పటివరకు 117కోట్ల ఆర్థిక సహాయం అందించింది. జీఓ.నంబర్‌ 8 మేరకు రాష్ట్రంలో చెక్‌ డ్యాంల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటివరకు 200చెక్‌ డ్యాంలు పూర్తి కాగా 640 చెక్‌ డ్యాంల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పూర్తి అయిన చెక్‌ డ్యాం చదరపు కిలో మీటరు పరిధిలో భూగర్భజలాలు పెంపొండం తో పాటు ఆశించిన ఫలితాలు వచ్చాయి. భూగర్భ జలాలు పెరగడంతో పాటుగా పంటల దిగుమతులు కూడా పెరిగాయి.

చదరపు కోలో మీటరు పరిధిలో యాసంగి పంటకు కూడా భూగర్భజలవనరులు అందుతుండటం గమనార్హం. ఉదహారణకు గత సంవత్సరం గోదావరి వరదల కాలంలో 2502 టీఎంసీలు సమద్రంలో కలవగా చెక్‌ డ్యాంల నిర్మాణాలతో సుమారు ప్రస్తుతం కొంతమేరకు తగ్గినట్లు సమాచారం. ఉత్తరతెలంగాణతో పోల్చుకుంటే దక్షిణ తెలంగాణలో వర్షపాతం తక్కువగా ఉండటంతో చెక్‌ డ్యాంల నిర్మాణాలతో నీటిని నిల్వచేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో 8వందల నుంచి 12వందల ఎంఎం వర్షపాతం నమోదుకాగా దక్షిణ తెలంగాణలో వర్షపాతం 600ఎంఎం నుంచి 800ఎంఎం వరకు ఉండటంతో చెక్‌ డ్యాంలనిర్మాణాల ప్రాధాన్యత అధికంగా ఉంది.

చదరపు కిలోమీటర్‌ కు ఒక చెక్‌ డ్యాం అవసరం

ప్రాజెక్టుల నిర్మాణాలు అత్యంత వ్యయంతో ఉండగా చెక్‌ డ్యాంల నిర్మాణాలు తక్కువవ్యయంతో ఎక్కువ లాభాలు వస్తాయని విశ్రాంత ఇంజనీర్ల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యాంప్రసాద్‌ రెడ్డి చెప్పారు. కరువుపీడిత ప్రాంతాల్లో ఈ డ్యాంలు విరివిగా నిర్మిస్తే భూగర్భజలాలు పెంపొంది వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని చెప్పారు. పచ్చదనం, భూసారం, భూగర్భజలాల పెంపుదల అవుతుందని చెప్పారు. అయితే గొలుసుకట్టు విధానాలతో నిర్మిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలవనరులకు ఇస్తున్న ప్రాధాన్యత కాకతీయ రాజులను మరిపిస్తుందని ఆయన ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement