Thursday, May 2, 2024

పెళ్లి పేరుతో మోసం చేశాడని హీరో ఆర్యపై చీటింగ్ కేసు నమోదు

తమిళ స్టార్ హీరో ఆర్య పై జర్మనీకి చెందిన ఓ మహిళ అ చీటింగ్ కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హీరో ఆర్య దారుణంగా మోసం చేశాడని సదరు యువతి ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆర్య… ఏకంగా రూ.70 లక్షలు అన్యాయంగా తీసుకున్నాడని ఆ మహిళ పేర్కొంది. ఈ మేరకు ఆర్యకు, తనకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను కూడా ఈ ఫిర్యాదులో జోడించింది. అంతేకాకుండా హీరో ఆర్య తర్వాతి సినిమాలు కూడా విడుదల కాకుండా బ్యాన్ విధించాలని జర్మనీ యువతి డిమాండ్ చేసింది.

హీరో ఆర్యపై జర్మనీ యువతి దాఖలు చేసిన కేసుపై గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. ఇక ఈ కేసును ఆగస్టు మాసం 17 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అయితే ఈ కేసు పై హీరో ఆర్య మరియు అతని టీం ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ఇటీవలే హీరో ఆర్య భార్య సాయోషా సైగల్ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: సత్యదేవ్ ‘తిమ్మరుసు’ మూవీ రివ్యూ

Advertisement

తాజా వార్తలు

Advertisement