Tuesday, April 30, 2024

చంద్ర‌ముఖికి సీక్వెల్ – హీరోయిన్ గా త్రిష‌ !

చంద్ర‌ముఖి చిత్రానికి సీక్వెల్ రాబోతున్న‌ట్లు ప్రొడ‌క్ష‌న్ హౌజ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్ అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేసింది. ఈ సీక్వెల్ కు కూడా పి.వాసుయే దర్శకత్వం వహిస్తారని తెలుపుతూ పోస్టర్ రివీల్ చేసింది. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తారని మేకర్స్ తెలిపారు. కాగా, ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసేది ఎవరు అనేది కీలకంగా మారింది. ఎందుకంటే ‘చంద్రముఖి’ సినిమా మాదిరిగానే సీక్వెల్ లోనూ ప్రధాన హీరోయిన్ పాత్ర చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే ఆ పాత్రకు స్మైలింగ్ క్వీన్ త్రిషను సెలక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. చంద్రముఖి సినిమాలో జ్యోతిక భయపెట్టిన మాదిరిగానే త్రిష కూడా సీక్వెల్ లో భయపెట్టగలదా? అని ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, త్రిష ఈ ప్రాజెక్టులో జాయిన్ అయిందా? అనే విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. త్వరలో ప్రకటన వచ్చే చాన్స్ ఉందని కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement