Friday, April 26, 2024

కేంద్ర కేబినెట్ కమిటీల్లో కీలక మార్పులు..

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే…కేంత్ర మంత్రి వర్గంలోకి కొందరు కొత్తగా మంత్రి పదవులు చేపట్టగా మరికొందరు మంత్రి వర్గాన్ని వీడారు.. దీంతో దీంతో కేబినెట్‌ కమిటీలను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పునర్‌వ్యవస్థీకరించారు. మోదీ నేతృత్వం వహిస్తున్న రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉప సంఘంలో స్మృతి ఇరానీతో పాటు మాండవీయ, భూపేంద్ర యాదవ్‌, వీరేంద్రకుమార్‌, గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, సోనోవాల్ ఉన్నారు. అలాగే ప‌లు కమిటీల్లో కొంద‌రు కొత్త మంత్రులు చేర‌గా, మ‌రికొన్ని క‌మిటీల్లో మార్పులు లేవు.

పార్లమెంటరీ వ్యవహారాల ఉప సంఘం: రాజ్‌నాథ్‌ సింగ్‌,  అనురాగ్‌ ఠాకూర్‌, కిరణ్‌ రిజిజు, వీరేంద్ర కుమార్‌. ఇక నైపుణ్య వ్యవహారాల ఉప సంఘం: ఆర్సీపీ సింగ్‌, అశ్వనీ చౌబే, భూపేంద్ర యాదవ్‌, కిషన్ రెడ్డి. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (ఎలాంటి మార్పులు లేవు):  మోదీ,  రాజ్‌నాథ్‌ సింగ్‌,  అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌,  జైశంకర్ కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: అన్ని వేరియంట్లను అడ్డుకుంటున్న స్పుత్నిక్ వి..

Advertisement

తాజా వార్తలు

Advertisement