Friday, April 26, 2024

ఆర్ ఆర్ ఆర్…కొమరం భీం డైలాగ్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతాయట!!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పాత్రలో చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయట. ముఖ్యంగా దేశభక్తిపై చెప్పే డైలాగ్స్ థియేటర్స్ లో ఈలలు వేయిస్తాయట. ప్రతి డైలాగ్ కూడా తూటాల పేలుతాయట. మరి తారక్ ఏమేర అదరగొట్టాడు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్, అలియాభట్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement