Sunday, April 28, 2024

అగ్ని వీర్ ల నియామ‌కాల ప్ర‌క్రియ స్టార్ట్- నోటిఫికేష‌న్ తేదీల‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

ఆర్మీ విభాగంలో అగ్ని వీర్ ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ తేదీల‌ను కూడా ప్ర‌క‌టించింది. అగ్నిప‌థ్ ప‌థ‌కంపై ఓ వైపు నిర‌స‌న‌లు మిన్నంటుతున్నా… కేంద్రం మాత్రం ఈ ప‌థ‌కం కింద నియామ‌కాల‌కు కీల‌క‌ ముంద‌డుగు వేసింది. భార‌త సైన్యంలోని నావికా ద‌ళంలో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం మంగ‌ళ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదే స‌మ‌యంలో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం ఈ నెల 24న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద అగ్నివీర్‌ల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచే ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement