Friday, May 17, 2024

Central Budget పేదరికం లేని భారత్ ధ్యేయం…. వచ్చే ఐదేళ్లల్లో అద్భుత ప్రగతి – నిర్మలా సీతారామన్

ప్రజల ఆదాయం పెరిగింది
పేదలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమం సర్కారు లక్ష్యం
మౌలిక సదుపాయాలకు రూ.11 లక్షల కోట్లు
కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు
11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో సాయం
పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

రాబోయే అయిదేళ్లలో భారత దేశం తిరుగులేని పురోగతిని సాధిస్తుందని, అద్బుత ప్రగతిని సాధిస్తుందని, పేదరిక నిర్మూలన దిశంలో ఇప్పటికే 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో స్పష్టం చేశారు. గురువారం పార్లమెంట్లో 2024 మధ్యంతర బడ్జెట్నుప్రవేశపెట్టారు. ఈసందర్భంగా గత పదేళ్లుగా తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని నెమరువేశారు. పన్నుల వాతలు, ఊరింతలు లేని, ఆదాయం, వ్యయం, ఆర్థిక లోటు లేని పద్దుల ఖాతాను తన ప్రసంగంలో వివరించారు.

సంక్షేమమే ధ్యేయంగా..
ప్రజల ఆదాయం 50 శాతం పెరిగిందని అన్నిరంగాల్లోనూ ఆర్థికవృద్ధిని సాధిస్తున్నామని, జీడీపీ అంటే అంటే పాలన , అభివృద్ధి, పనితీరు అని కొత్త నిర్వచనం చెప్పారు. పేదరికం లేని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటానికి సమ్మళిత, సంతులిత ఆర్థిక విధానాలతో అందరికీ ప్రగతి ఫలాలు అందాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ కలిగాయనిపేదలు, మహిళలు, యువత, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలతో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని, 80 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీతో ఆహార సమస్య తీరిందని, గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్అన్నారు. పేదరికం నిర్మూలనకు బహుముఖ కార్యాచరణ అమలు చేశామని, పేదల జన్ధన్ఖాతాల్లో రూ.34లక్షల కోట్లు జమ చేశామని, 78 లక్షల వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం చేశామని వివరించారు. వచ్చే ఐదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించనున్నారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు చేస్తామని, , 9- నుంచి 18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారినపడకుండా చర్యలు తీసుకుంటామనిమంత్రి వివరించారు.

యువతకు విద్య, ఉపాధి,,,

రూ.2.20 లక్షల కోట్ల మేరకు పూచీకత్తులేని రుణాలు అందించామని సీతారామన్ తెలిపారు. స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని, ముద్ర యోజనాలో యువతకు రూ.25 లక్షల కోట్లమేరకు రుణసాయం చేశామన్నారు. స్కిల్ఇండియామిషన్ 1.40 కోట్లమందియువతకునైపుణ్యశిక్షణఇచ్చామని, జాతీయ విద్యావిధానంతో యువతకు సాధికారత కల్పిస్తున్నామని, మూడువేల ఐటీఐలను, 390 వర్సిటీలను ఏర్పాటు చేశామని, ఉన్నత విద్యకు ప్రాధాన్యంతో గత పదేళ్లలో ఏడు ఐఐటీలు, 16 ట్రిపుల్ఐటీలు, ఏడు ఐఎంఎఎంలు, 15 ఎయిమ్స్ఏర్పాటు చేశామని, విదేశీ విద్యను అభ్యసించే యువతుల సంఖ్య 28 శాతం పెరిగిందని మంత్రి సీతారామన్వివరించారు.

- Advertisement -

అన్నదాత కోసం…

గత పదేళ్ల అన్నదాతల సంక్షేమం కోసం 11.8 కోట్లమందికి ఆర్థిక సాయం అందిస్తున్నామని, 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని,మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలను ఇచ్చామని, మంత్రి సీతారామన్వివరించారు. దేశంలో మరిన్ని మెడికల్‌ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాంపరిశోధన, సృజనాత్మకకు రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాంమధ్యతరగతి ప్రజల ఇంటి నిర్మాణాలకు, కొనుగోలు మద్దతు ఇస్తామని, స్వయం సహాయక బృందాల కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని, లక్‌ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నామని నిర్మల సీతారామన్ తెలిపారు.

రూ. 11 లక్షల కోట్లతో .. మౌలిక సదుపాయాలు

మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాంఉడాన్‌ పథకంలో 517 రూట్లలో కోటి కొత్త ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నామని, మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తామని, 40వేల నార్మల్‌ బోగీలను వందేభారత్‌ ప్రమాణాలకు పెంచుతామని , ఇంధనం, సిమెంట్‌, ఖనిజాల కారిడార్‌ను, పోర్టు కనెక్టివిటీ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని, మౌలిక వసతుల రంగం 11.1 శాతం వృద్ధితో రూ.11 లక్షల 11వేల 111 కోట్ల కేటాయించామనికేంద్ర మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలసి పనిచేస్తున్నాంఎంఎస్ఎంఈరంగానికి సకాలంలో ఆర్థిక వనరులు కల్పిస్తున్నామని, సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని, మనం ప్రారంభించిన యూరప్‌ కారిడార్‌ ప్రపంచ వాణిజ్యానికి కీలకం కాబోతున్నాయని మంత్రి నిర్మల సీతారామన్తెలిపారు.

ఆర్థికాభివృద్ధిలో ఢోకా లేదు

  • సంస్కరణపథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందిఅందుకే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని, సబ్‌కా సాత్‌,సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అనే నినాదంతో – గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోంది- గతంలో సామాజిక న్యాయం అనేది రాజకీయ నినాదంగా ఉండేదితమ ప్రభుత్వంలో సామాజిక న్యాయం తమ పనితీరుగా మారిందని మంత్రి నిర్మల సీతారామన్వివరించారు. ఇది కార్యాచరణలో లౌకిక వాదంగా- వనరులను సమర్థంగా పంచి బంధుప్రీతిని, అవినీతిని రూపుమాపామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయం పెరిగింది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది, ప్రజలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నాం.ఈ బడ్జెట్ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తుందని, ఆశ్రిత పక్షపాతాన్ని కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యువతపై దేశానికి అపారమైన నమ్మకం ఉంది. క్రీడల్లో యువత పాల్గొన్నారు. 10 ఏళ్లలో మన ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందన్నారు. తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పనులు చేసింది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని రుజువైందన్నారు. జీడీపీపై మా ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేస్తోందని సీతారామన్ అన్నారు. సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాం.ఆర్థిక వ్యవస్థ చాలా బాగా ఉందని. ప్రజల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయని, . రాష్ట్రాల అభివృద్ధికి మా ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement