Wednesday, May 1, 2024

నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ను తగ్గించిన కేంద్రం.. పీజీ వైద్యవిద్య ప్రవేశాలకు అవకాశం

వరంగల్ : పీజీ నీట్‌ పరీక్ష కటాఫ్‌ స్కోర్‌ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవడానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలతో పాటు హైదరాబాద్‌ నిమ్స్‌ కళాశాలలో కాంపిటెంట్‌ అథారిటీ కోటా పీజీ వైద్య సీట్లను ఈ నోటిఫి కేషన్‌ ద్వాాం భర్తీ చేయనున్నారు. నీట్‌ పీజీ 2021 అర్హత కటాఫ్‌ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తగ్గించింది. తగ్గిన కటాఫ్‌ స్కోర్‌ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 16 ఉదయం 8 గంటల నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. మరిన్ని వివరాలకు WWW.KNRUHS.Telangana.GOV.in వెబ్‌సైట్‌ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.

పర్సంటైల్‌ తగ్గించిన కేంద్రం..

కేంద్ర ఆరోగ్య మంత్రి త్వశాఖ నీట్‌ 2021 పీజీ కటాఫ్‌ మార్కులను 15 పర్సంటైల్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనరల్‌ అభ్యర్థులు 35 పర్సంటైల్‌ 247 మార్కులు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీకి 25 పర్సంటైల్‌ 210 మార్కులు, దివ్యాంగులకు 30 పర్సంటైల్‌ 229 మార్కులు కటాఫ్‌ నిర్ణయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement