Saturday, April 27, 2024

బాల‌య్య బ‌ర్త‌డే అడ్వాన్స్ గా సెలెబ్రేష‌న్స్.. పూన‌కాలు తెప్పిస్తున్న Nbk107 టీజర్..

మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న Nbk107. ఈ మూవీ షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. రీసెంట్‌గా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలయ్యకు సంబంధించిన రెండు లుక్స్‌ విడుదల చేయ‌గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ శుక్రవారం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే సెల‌బ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు మూవీ మేక‌ర్స్. ఈ టీజర్ బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టు ఓ రేంజ్‌లో మాస్ రాంపేజ్‌గా ఉంది. టీజ‌ర్ లోని డైలాగ్స్ యాక్ష‌న్ తో అభిమానుల‌కు పూన‌కాలు త‌ప్ప‌వు.. ముఖ్యంగా భయం నా బయోడేటాలోనే లేదు బోసిడీకే.. నరకడం మొదలు పెడితే.. ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడక్కల్లారా.. వంటి డైలాగులు బాలయ్య అభిమానులకు కిక ఎక్కించేలా ఉన్నాయి. మైనింగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఈ టీజర్‌ చూస్తే తెలుస్తోంది. మొత్తంగా ధర్మ సంస్థపానార్ధం ఆయుధం పట్టిన వ్యక్తి పాత్రలో బాలయ్య క్యారెక్టర్‌ను రూపోందిచాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement