Thursday, November 14, 2024

సత్యపాల్‌ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు.. ఆదేశించిన జమ్మూ ప్రభుత్వం

మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చేసిన ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్‌ ప్రభుతం సీబీఐ విచారణకు ఆదేశించింది. రెండు ఫైల్స్‌ క్లియర్‌ చేస్తే.. తనకు రూ.300 కోట్ల లంచం ఇవడానికి రెడీ అయ్యారని సత్యపాల్‌ మాలిక్‌ కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఆ ఫైల్స్‌లో ఒక ఫైల్‌ ఓ పారిశ్రామికవేత్తది కాగా.. మరో ఫైల్‌ ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతదిగా ఆయన వెల్లడించారు. సత్యపాల్‌ మాలిక్‌ జమ్మూ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆరోపణలు చేశారు. ఈ ప్రతిపాదనను తాను తిరస్కరించానని తెలిపారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ విషయంపై విచారణ జరపాలని జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం సీబీఐకి సిఫార్సు చేసింది. ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని.. నిష్పక్షపాతంగా ఉండాలని జమ్మూ ప్రభుత్వం సీబీఐని కోరింది.

రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ హోదాలో సత్యపాల్‌ మాలిక్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో రూ.300 కోట్ల లంచం వ్యవహారం ప్రకటించారు. ఒక ఫైల్‌ అంబానీది అని, మరొకటి ఆర్‌ఎస్‌స్‌ నేతది అన్నారు. బీజేపీ, మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలోనూ అతను ఉన్నారని తెలిపారు. అతను మోడీకి కూడా ఎంతో సన్నిహితుడన్నాడు. రూ.300 కోట్లు లంచం తిరస్కరించి.. ఫైల్‌ను క్యాన్సల్‌ చేసినట్టు అప్పట్లో మాలిక్‌ చెప్పుకొచ్చాడు. తాను 5 జతల బట్టలతోనే వచ్చానని, వాటితోనే వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement