Saturday, May 4, 2024

ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై సీబీఐ కేసు

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు నమోదైంది. ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన రఘురామ కృష్ణంరాజు‌ కంపెనీ… రుణంగా పొందిన రూ. 237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు సీబీఐకి చెన్నై ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్‌ ఫిర్యాదు చేశారు. మార్చి 23న రవిచంద్రన్‌ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. 

ఫోర్జరీ సంతకాలు, పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు… రూ.237 కోట్లు రుణాలను ఎగగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంద్‌ భారత్ పవర్ లిమిటెడ్  డైరెక్టర్ గా ఉన్న ఎంపి రఘురామ కృష్ణమరాజుతోపాటు ఇతర డైరెక్టర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.  నిందితులందరూ కుమ్మక్కై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటు ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించడం తదితర నేరాలకు పాల్పడినట్టు ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఈ వ్య‌వ‌హారం న‌డిచిందన్న విష‌యాన్ని తాము ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో గుర్తించామని బ్యాంక్ అధికారులు‌ ఫిర్యాదులో పేర్కొన్నార‌ని సీబీఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement