Friday, May 3, 2024

ఆర్య‌న్ రిలీజ్‌కు క్యాష్‌ డీల్‌.. పోలీసుల చేతిలో సీసీ టీవీ ఫుటేజీ..

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఆ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెల‌కొంటున్నాయి. ప్రైవేట్ డిటెక్టివ్ కెపి గోసావిని కలిసిన పూజా దద్లానీకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని ముంబై పోలీసులు యాక్సెస్ చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు, గోసావి, సామ్ డిసౌజా లోయర్ పరేల్‌లో పూజను కలుసుకున్నారని.. ఆర్య‌న్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయడానికి 18 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని గోసావి మాజీ సహాయకుడు ప్రభాకర్ సెయిల్ పేర్కొన్నారు. దీనిపై కూడా ఆర్యన్‌తోపాటు గోసవిపై పోలీసులు కేసు నమోదు చేయవచ్చని బాలివుడ్ వ‌ర్గాల స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement