Sunday, April 28, 2024

‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ధనుష్ ది వన్ మ్యాన్ ఆర్మీ

ధనుష్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ పీరియాడికల్ యాక్షన్ డ్రామా “కెప్టెన్ మిల్లర్”. బడ్జెట్ పరంగా ధనుష్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ చిత్రం. ధనుష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇక సత్యజ్యోతి ఫిలింస్ నిర్మిస్తున్న‌ ఈ మూవీ నుండి కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా, ధనుష్ అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెబుతూ ఒక అప్డేట్ ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

ఈ మూవీ నుంచి ఇవ్వాల‌ (జూన్ 30న) ధ‌నుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ మూవీ 1930 – 1940ల నాటి నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ధనుష్ గన్‌తో రగ్గడ్ లుక్‌లో కనిపించాడు. బ్యాక్‌డ్రాప్‌లో అతని చుట్టూ పోలీసుల మృతదేహాలు.. దూరంగా వాహనాలతో యుద్ధం లాంటి దృశ్యం క‌నిపిస్తోంది. రెస్పెక్ట్ ఈజ్ ఫ్రీడమ్ అంటూ ధనుష్ ఈ పోస్టర్‌ను షేర్ చేశాడు.

ఇక పోతే నెక్స్ట్ మంత్ (జూలై) లో టీజర్‌ను విడుదల చేయనున్నట్టు స‌మాచారం. ఈ మూవీలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్, RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement